‘7 డేస్ 6 నైట్స్’కు 16 ఏళ్ళ సంగీత దర్శకుడు!

‘డర్టీ హరి’ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు. తాజాగా ఆయన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుని వందమంది టీమ్ తో నాలుగు కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడిపిలో షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పటికే డబ్బింగ్ సైతం కంప్లీట్ అయిన ఈ సినిమా రీ-రికార్డింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీతో 16 సంవత్సరాల సమర్థ్ గొల్లపూడి సంగీత దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆర్. ఆర్.కు సంబంధించిన ఓ చిన్న వీడియోను మంగళవారం దర్శకుడు ఎం. ఎస్. రాజు విడుదల చేశారు. గతంలో ఎమ్మెస్ రాజు ‘దేవి’ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ ను టీనేజ్ లోనే సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఇప్పుడు ‘7డేస్ 6 నైట్స్’తో సమర్థ్ గొల్లపూడిని అవకాశం ఇచ్చారు. మరి డీఎస్పీ లానే ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా సంగీత ప్రపంచంలో స్టార్ గా ఎదుగుతాడేమో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-