తెలంగాణలో కొనసాగుతున్న 6వ రోజు లాక్ డౌన్ సడలింపు

తెలంగాణలో 6వ రోజు లాక్ డౌన్ సడలింపు కొనసాగుతుంది. నిన్న మొన్నటితో పోలిస్తే అల్వాల్ రైతు బజార్ లో జనాల తాకిడి తగ్గింది. 10 లోపు తమ కూరగాయలను అమ్ముకొని పోతున్నామని అంటున్నారు అమ్మకం దారులు. ఈ టైమింగ్స్ బాగున్నాయి. ఇంతకు ముందు సాయంత్రం 7 వరకు ఉండే వారము. తెచ్చిన కూరగాయలు పది లోపే అమ్ముకొని పోతున్నాము… గిరాకీ బాగానే ఉంది. రేట్లు కూడా పెరగలేదు అని అన్నారు. ఈ మార్కెట్ లో రేట్స్ రిజనబుల్ గానే ఉన్నాయి అని వినియోగదారులు కూడా తెలిపారు. నిన్న ఆదివారం జనం ఎక్కువగా ఉన్నారు. కానీ ఈరోజు తగ్గారు వినియోగదారులు తెలిపారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-