నాని మతిమరుపుకు ఆరేళ్ళు

నాచురల్ స్టార్ నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల అయ్యి నేటికి ఆరేళ్ళు అవుతోంది.. ఈ చిత్రంతో నాని ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మతిమరుపును ప్రధానాంశంగా కథను రాసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. నానిని నటన పరంగాను మరోమెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం. గోపీసుందర్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక అన్ని విభాగంలోనూ అద్భుతంగా వచ్చిన ఈ సినిమా ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం చాలా రీచ్ గా వచ్చింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో పాటు గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో నిర్మించారు. మురళీ శర్మ, నరేష్, సితార, అజయ్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక టీవీల్లో పలుసార్లు ప్రసారమైన ఈ చిత్రం మంచి టీఆర్పీలే సాధించింది.

Related Articles

Latest Articles

-Advertisement-