గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. మూసీ గేట్లు ఎత్తివేత..

ఉభయ తెలుగు రాష్ట్రాలపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. గులాబ్‌ విజృంభణతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. దీంతో.. తెలంగాణలోని 14 జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.. ఇక, హైదరాబాద్‌లోనూ ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. సాయంత్రం నుంచి అయితే.. కుంభవృష్టే కురుస్తోంది.. ఈ ఎఫెక్ట్‌ క్రమంగా మూవీ నది ప్రభావంపై పడుతుండడంతో.. అప్రమత్తమైన అధికారులు.. మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.. ఇవాళ మూసీ 6 క్రస్టు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.. 2, 3, 4, 7, 10, 11 నంబరు గేట్ల ద్వారా 10884.04 క్యూసెక్కుల నీటిని ముందస్తుగా విడుదల చేశారు. ఇక, హైదరాబాద్‌లో వర్షం ఇంకా భారీగానే కురుస్తుండడంతో.. మూసీ ప్రాజెక్టుకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరుగుతూ పోతోంది. దీంతో.. మరికొన్ని గేట్లను కూడా ఎత్తివేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related Articles

Latest Articles