“సీటిమార్” ట్రైలర్ మార్మోగిపోతోంది !

యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఆగష్టు 31 మంగళవారం ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఉన్న మసాలా, ఎంటర్‌టైనర్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. పవర్-ప్యాక్డ్ “సీటిమార్” ట్రైలర్ కు 6.5 మిలియన్ వ్యూస్ తో పాటు 150కే + లైక్స్ రావడం విశేషం. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Read Also : సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాకిచ్చిన “జాతిరత్నం”

సంపత్ నంది దర్శకత్వం వహించిన “సీటిమార్”ను ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సినిమాను వాయిదా వేశారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. కానీ వినాయక చవితి వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ సెప్టెంబర్ 10 కి రీ షెడ్యూల్ చేశారు. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో నటిస్తుంది. 2017లో వచ్చిన “గౌతమ్ నంద” తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించచారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ”తో ఢీ కొట్టనుంది.

Related Articles

Latest Articles

-Advertisement-