ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా సౌత్ లో మరే హీరోకూ లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్నాడు. వరుస భారీ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రభాస్ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.

Read Also : ప్రకాష్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు రియాక్షన్

‘బాహుబలి’ సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. బాహుబలి వంటి పీరియాడిక్ మూవీస్ లో మ్యూజిక్ కంపోజర్ పాత్ర మరింత కీలకం అవుతుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’కు సౌండ్‌ట్రాక్ అందించే అతి పెద్ద బాధ్యతను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన భుజాలపై వేసుకుని విజయవంతం అయ్యారు. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్ లోని ‘కౌన్ హైన్ వోహ్’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్ షాపింగ్ కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ పాటకు హిందీలో మనోజ్ ముంతాషిర్‌ సాహిత్యం అందించగా, కైలాష్ ఖేర్, మౌనిమా ఆలపించారు.

-Advertisement-ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు

Related Articles

Latest Articles