ఏపీకి చేరిన మరికొన్ని కరోనా టీకా డోసులు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు చేరాయి. అయితే రాష్ట్రానికి కొత్తగా చేరిన 76 వేల కొవిషీల్డ్, 50 వేల కొవాగ్జిన్ టీకాలతో వ్యాక్సిన్ కొరతకు కొంత ఉపశమనం లభించింది. ఈ టీకాలను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు తరలించనునారు అధికారులు. మరికొన్ని టీకా డోసులు రాష్ట్రానికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు అలాగే 100కు పైగా మరణాలు నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-