న్యూయార్క్‌ విలవిల..50 మంది మృతి!


రాత్రి ఎనిమిదికి మొదలైంది. వర్షం టెర్రర్‌…పదకొండు వరకు కంటిన్యూగా దంచుతూనే ఉంది…
ఫలితంగా నగరం అతలాకుతలం…మూడుగంటల్లో మొత్తం అస్తవ్యస్తం….ఇదీ రాత్రి హైదరాబాద్‌లో రాత్రి జలప్రళయం…

రాత్రి కురిసిన వానను చూసిన వారికి.. ఆకాశానికి చిల్లుపడిందా అనిపిచింది.. రోడ్లు కాల్వలయ్యాయి.. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌.. ఇలా ప్రధాన కూడళ్లు చెరువు లయ్యాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌. లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరింది. కృష్ణానగర్‌ ఎ-బ్లాక్‌ వద్ద వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోగా.. స్థానికులు కాపాడారు.ఈ మధ్య కాలంలో ఇటువంటి వర్షాన్ని చూడలేందంటున్నారు నగరవాసులు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలయ మమ్యాయి.. కాలనీలు నీటమునిగాయి. మ్యాన్‌‌ హోల్స్​ పొంగిపొర్లాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​. కరెంట్‌ పోవటంతో కొన్ని గంటలపాటు నగరం అంధకారమైంది. జూబ్లీహిల్స్‌‌లో 9.8 సెం.మీ., ఖైరతాబాద్​లో 6.8 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్‌ రికార్డయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఏస్థాయిలో వర్షం పడిందో.

హైదరాబాద్‌ మాత్రమే కాదు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మరో రెండు మూడు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని లోకరి(కే)లో అత్యధికంగా 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్నూర్​లో 69 మిల్లీమీటర్లు, మేడ్చల్ జిల్లాలోని బాలానగర్​లో 68.8 మిల్లీమీటర్లు, హైదరాబాద్​జిల్లాలోని ఎంసీఆర్ హెచ్​ఆర్డీ ఐటీ క్యాంపస్​లో 66.8 మిల్లీమీటర్లు, యూసుఫ్ గూడ, కృష్ణానగర్​లో 64 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొద్ది రోజుల నుంచి జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. రెండు రోజుల క్రితం దక్షిణ గుజరాత్‌ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రా వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని, మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్రప్రదశ్‌, ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో ఏపిలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. వరద నీరు ముంచెత్తుతోంది. పలు ప్రంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఢిల్లీ తడిసి ముద్దవుతోంది. కొన్ని గంటలు తెరపి ఇచ్చి మళ్లీ ప్రతాపం చూపుతోంది. బుధవారం నాడు మరీ దారుణం. పంతోమ్మిది సంవత్సరాల రికార్డు బద్దలయింది. జనజీవనం స్తంభించింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. నగరంలో పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల తీరు మారింది. దాంతో భారీ వర్షాలను అంచనా వేయలేకపోతున్నామంటోంది వాతావరణ విభాగం. ఈ నెల 7 నుంచి మళ్లీ భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

మరోవైపు అమెరికాను కూడా వర్షం అల్లాడిస్తోంది. ఇదా తుపాన్‌ దెబ్బకు దక్షిణాది రాష్ట్రాలు షేకవుతున్నాయి. ఇక ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో ఇదా టెర్రర్‌ కొనసాగుతోంది. దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు. నగరం జలదిగ్బంధమైంది. రోడ్లపై నీరు పొంగిపోతోంది.. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సబ్‌ వే సర్వీసులను నిలిచిపోయాయి. చాలా ఏర్‌పోర్టులు సర్వీసులు నిలిపివేశాయి. నగరంలో ఎమర్జెన్సీ కొనసాగుతోంది.

న్యూయార్క్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు చూస్తున్నామంటున్నారు స్థానికులు. తాజా వర్షాలపై ప్రెసిడెంట్‌ బైడెన్‌ స్పందించారు. ఐదా తుఫాన్‌ ధాటికి జరిగిన భారీ నష్టం పట్ల సాయం చేయడానికి దేశమంతా సిద్ధంగా ఉందన్నారాయన. ఒక్క న్యూయార్కే కాదు …దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో దాదాపు ఇదే పరిస్థితి. న్యూజెర్సీ లో కూడా సేమ్‌ సీన్స్‌. ఇక్డక కనీసం 23 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మన్‌హటన్‌, దిబ్రోంక్స్‌, క్వీన్స్‌లోని హైవేలు నీట మునిగాయి. రోడ్ల మీద నిలిచివున్న కార్లన్నీ నీటమునిగాయి. మరణాల్లో అనేక మంది తమ వాహనాల్లో చిక్కుకుని చనిపోయినట్టు సమాచారం.

పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలోకి ప్రమాదకరస్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ల్యారీ తుపాను అంతకంతకూ బలపడుతోందని, శనివారం కల్లా అది ఇడా స్థాయిలో తీవ్రరూపు దాల్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అమెరికా తరచూ ఈ పెను తుపాన్ల భారినపడుతోంది. ఇప్పుడు ఇడా తుపాను పంజా విసురుతోంది. తరువాత ల్యారీ. ఇలా ఉన్నట్టుండి వరదలు చుట్టుముట్టటం వారికి శాపంగా మారింది. రాత్రికి రాత్రే కనీసం 44 మంది ప్రాణాలు పోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎక్స్‌పర్ట్స్‌ దీనిని ‘చారిత్రాత్మక వాతావరణ సంఘటన’ గా అభివర్ణిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-