ఢిల్లీ బీజేపీ ఆఫీసులో కరోనా టెర్రర్.. 50మందికి పైగా!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. 2లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా వీఐపీలకు కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో 50 మంది కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ కమిటీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. కరోనా పరీక్షల్లో 50 మందికిపైగా కరోనా పాజిటివ్ తేలింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఈసమావేశాలు చాలా కీలకం. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర కార్యాలయం మీడియా ఇన్‌ఛార్జ్‌ సంజయ్‌ మయూక్‌కు కూడా కరోనా సోకింది. దీంతో నేతలు హోం క్వారెంటైన్​కు పరిమితం అయ్యారు. పాజిటివ్‌ వచ్చిన నాయకులు తరుచూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలకు హాజరు కావడం వల్ల ఇంకా ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడతారోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఆంక్ష‌లు ఎత్తివేసే ఆలోచ‌న‌లో ఢిల్లీ ప్ర‌భుత్వం…

యూపీ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై బీజేపీ కోర్‌ కమిటీ మంగళవారం ఆరు గంటలకు పైగా కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యింది. దీనిలో కూడా పలువురు నేతలకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం జరగాల్సిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు సమావేశాలు నిర్వహించాలా వద్దా అనేది ఇంకా తేలలేదు. కీలక నేతలకు పాజిటివ్ రావడం వల్ల కమిటీ సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించనున్నారు.

Related Articles

Latest Articles