2022లో బైక్ ప్రియుల‌కు పండ‌గే పండ‌గ‌… ఎందుకంటే…

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  మ‌రోవైపు కాలుష్యం కార‌ణంగా చాలామంది చ‌మురు బైక్‌ల‌ను ప‌క్క‌న పెట్టేశారు.  వీలైనంత వ‌ర‌కు ప‌బ్లిక్ వాహ‌నాల్లో ప్ర‌యాణం చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇక మ‌రికొంత మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ పెరుగుతున్న‌ది. ప‌లు స్టార్ట‌ప్ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే.  సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మామూలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌తో పాటుగా యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు స్పోర్ట్ కేట‌గిరి ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను త‌యారు చేస్తున్నారు.  2022లో అనేక ఎల‌క్ట్రిక్ స్పోర్ట్స్ బైకులు అందుబాటులోకి రాబోతున్నాయి.  

Read: ఇంజ‌నీర్ అవినీతి భాగోతం… పైప్‌లైన్ తెరిస్తే నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి…

బెంగ‌ళూరుకు చెందిన అల్ట్రా వ‌యొలెట్ ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్ స్టార్ట‌ప్ కంపెనీ అల్ట్రా వ‌యొలెట్ 77 పేరుతో ఎల‌క్ట్రిక్ వెహికిల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతున్న‌ది.  2022లో ఈ వెహికిల్ ను లాంచ్ చేయ‌బోతున్నారు. ఎఫ్ 77 బైక్‌ను మార్చి 2022లో లాంచ్ కాబోతున్న‌ది.  ఈ బైక్ అంచ‌నా ధ‌ర రూ. 3 ల‌క్ష‌లు.  150 నుంచి 200 కిమీ రేంజ్‌లో 200 కిమీ వేగంతో దూసుకుపోగ‌ల‌దు.  ఈ బైక్‌తో పాటుగా వ‌చ్చే ఏడాది ఎమోడ్ ఎల‌క్ట్రిక్ స‌ర్జ్ 10 కె, వివోల్ట్ కేఫ్ రేస‌ర్‌, ఎర్త్ ఎన‌ర్జీ వోల్వ‌డ్ జెడ్ బైక్‌లు లాంచ్ కాబోతున్నాయి.  యువ‌త‌ను ఆక‌ట్టుకునే విధంగా బైక్‌ల‌ను త‌యారు చేస్తున్న‌ట్టు ఈవీ స్టార్ట‌ప్‌లు తెలియ‌జేస్తున్నాయి.  

Related Articles

Latest Articles