వరంగల్‌ నిట్‌లో కరోనా కలకలం.. సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు

మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.. వరంగల్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. నిట్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులు, మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.. దీంతో అప్రమత్తమైన నిట్‌ అధికారులు.. ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు…

Read Also: ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ

ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన.. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఇక, నిట్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు పలు తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్వీ రమణారావు వెల్లడించారు.. పలువురు విద్యార్థులు కోవిడ్‌ బారిన పడుతుండడంతో.. మిగతా విద్యార్థులు, ఉద్యోగులందరికీ కూడా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related Articles

Latest Articles