పక్కాగా ఇళ్ళలో దొంగతనాలు.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న పాత నేరస్తుడు మంతి శంకర్ తో పాటు మరో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. మంత్రి శంకర్, సయ్యద్ అసద్, సయ్యద్ మెహరాజ్, మహ్నద్ మొహిజ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సైదాబాద్ పోలీసులు.

నిందితులపై మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరు కేసులు వున్నాయి. చిలకలగూడకి చెందిన నిందితుడు మంతి శంకర్ పై 260 దొంగతనం కేసులు. 209 కేసుల్లో మంతి శంకర్ కు శిక్ష ఖరారు అయింది. నాలుగు సార్లు పీడీ యాక్ట్ పెట్టినా మంతి శంకర్ తీరు మారలేదని పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 14న జైలు నుంచి విడుదలై మళ్లీ ముగ్గురితో కలిసి దొంగతనం ప్లాన్ చేశాడు.

ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్ తో డోర్ లాక్ చేయడం మంతి శంకర్ స్టైల్. రాత్రి ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య తాళం వేసిన, జనావాసాలకు దూరంగా వుండే చోట దొంగతనానికి ప్లాన్ వేస్తాడు. ఇళ్ల గోడలు దూకుతూ ప్రదేశాలు మారుతూ ఉండటం మంతి శంకర్ స్టైల్ అని పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles