ఆమెను చూస్తే ఖచ్చితంగా లవ్ లో పడతారంట…!!

“ఆమె ప్రేమ. ఆమె దయ. ఆమె కృష్ణ డ్రీం… ఆమె పుష్ప… ప్రిపేర్ అవ్వండి… ఎందుకంటే మీరు ఆమెతో ప్రేమలో పడడం ఖాయం…!” అంటున్నారు అర్ధశతాబ్దం మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ పాత్ర పుష్ప అని రివీల్ చేస్తూ ఆమెకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఆహా’లో జూన్ 11న ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఈరోజు హీరోయిన్ లుక్, పాత్ర పేరూ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన “ఏ కన్నులూ చూడనీ” సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ కు కూడా మంచి స్పందనే వస్తోంది. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-