లెక్క పెరిగింది.. భారత్‌లో 4కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు..

దక్షిణాఫ్రికాలో గత 15 రోజుల క్రితం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్‌ నుంచి భారత్‌తో పాటు పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌ బయటపడడంతో మరోసారి యావత్త ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. డెల్టావేరియంట్‌ కంటే 6రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు దేశాల్లో రోజు పదుల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ తన ఉనికిని చూపెడుతోంది.

ఉదయం దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకడంతో భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3కు చేరింది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ముంబైకి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ సోకినట్లు తేలింది. అయితే సదరు వ్యక్తి దోంభివలీకి చెందిన వాడిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కర్ణాటకలో 2, గుజరాత్‌, మహరాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Related Articles

Latest Articles