రాజ్‌ కుంద్రాకు భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు

ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు సంబంధించిన అశ్లీల చిత్రాల కేసు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్​కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా, ఆయనకు సంబంధించిన వియాన్​ ఇండస్ట్రీస్​లో పనిచేసే నలుగురు ఉద్యోగులు కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తునకు కుంద్రా సహకరించని నేపథ్యంలో పోర్న్​ రాకెట్​కు సంబంధించిన వివరాలు ఈ నలుగురు ఉద్యోగులు అందజేసినట్లు ముంబయి పోలీసులు స్పష్టం చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-