వ్యాక్సినేషన్‌పై కేంద్రం ప్రకటన

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేష‌న్ శ‌ర‌వేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇప్పటివ‌రకు 65 కోట్లకుపైగా వ్యాక్సిన్‌లు రాష్ట్రాలకు అందజేస్తే.. వృథా అయినవాటితో కలిపి 61 కోట్ల వ్యాక్సిన్ల వరకు వినియోగించారని.. ప్రస్తుతం మ‌రో 4.36 కోట్ల డోసులు రాష్ట్రాల ద‌గ్గర అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది కేంద్రం.

Related Articles

Latest Articles

-Advertisement-