పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బీజేపీ.. ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

పార్టీ ఫిరాయింపు దారులను బీజేపీ ప్రొత్సాహిస్తుందని అసోసియేష‌న్ ఫ‌ర్ డ‌మోక్రటిక్ రిఫార్మ్స్ తన అధ్యయనంలో వెల్లడించింది. 2014 నుంచి 21 మధ్య దేశ వ్యాప్తంగా 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి కాషాయ కండువా కప్పుకునట్లు తెలిపింది. అంతేగాక వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్ధులు బీజేపీ తీర్థం పుచుకున్నట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. గత ఏడేళ్లలో పార్టీ ఫిరాయింపులతో అత్యధికంగా బీజేపీ లాభపడగా, ఎక్కువగా నష్టపోయిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.

దేశ వ్యాప్తంగా 500 మంది ఎంపీలు ,ఎమ్మెల్యేలు ఒక వెయ్యి 133 మంది ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ మారినట్లు ఏడీఆర్ తన సర్వేలో గుర్తించింది. అత్యధికంగా కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన 222 మంది అభ్యర్థులు పార్టీ మారినట్లు తెలిపింది. అలాగే బీఎస్పీకి చెందిన 153 మంది అభ్యర్ధులు, 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అంతేగాక బీజేపీకి చెందిన 111 మంది అభ్యర్ధులు, 33 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కండువా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించినా వారిలో టీడీపీ నుంచి 32 మంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు, 26 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారారు. టీఆర్‌ఎస్ నుంచి నలుగురు అభ్యర్ధులు నలుగురు ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో చేరారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌లోకి 30 మంది చేరగా, వైసీపీలోకి 24 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి చేరారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-