ఆచార్య : ‘లాహే లాహే’ సాంగ్ కు రికార్డు వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య‌’. చిరంజీవి సరసన కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ స‌ర‌సన క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టించింది. ఈ చిత్రం మే 13న విడుద‌ల కావాల్సివుండగా.. క‌రోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ షెడ్యూల్ మిగిలివుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ కానుంది చిత్రబృందం. కాగా దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది. 30+ మిలియన్ వ్యూస్ దాటేసింది ‘లాహే లాహే’ సాంగ్. మీరు కూడా హృదయాలను కొల్లగొడుతున్న ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-