ఒమిక్రాన్ టెన్ష‌న్‌: అక్క‌డ 300 భ‌వ‌నాలు సీజ్‌…

ముంబై న‌గ‌ర‌లంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోదవుతున్నాయి.  గ‌త రెండు రోజులుగా రోజుకు 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  రెండు రోజుల వ్య‌వ‌ధిలో 25 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ్వ‌డంతో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు సిద్ద‌మ‌యింది.  ఇళ్ల స‌ముదాయాల్లో 20 శాతానికి మించి క‌రోనా కేసులు న‌మోదైతే ఆ బిల్డింగ్‌ను లేదా బిల్డింగ్ స‌ముదాయాల‌ను సీజ్ చేయాల‌ని ముంబై న‌గ‌ర‌పాల‌క సంస్థ నిర్ణ‌యం తీసుకుంది.  రెండు రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 300 ల‌కుపైగా భ‌వ‌నాల‌ను సీజ్ చేశారు.  

Read: థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి మిడ్‌లోనే… ముంబై ఢిల్లీలో…

క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయ‌ని, కానీ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ముంబై మేయ‌ర్ తెలిపారు.  ఆసుప‌త్రుల్లో అన్ని ర‌కాల వైద్య‌స‌దుపాయాలు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.  ముంబైతో పాటు పూణేలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  దీంతో మ‌హారాష్ట్ర వ్యాప్తంగా నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  విద్యాసంస్థ‌లను ఇప్ప‌టికే మూసివేశారు.  రాబోయే రోజుల్లో కేసుల తీవ్ర‌త మ‌రింత అధికంగా ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles