కోవిడ్‌ కలకలం.. మరో 30మంది వైద్యులకు పాజిటివ్

భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.. రోజువారి కేసుల సంఖ్య మళ్లీ 90 వేలను దాటేసింది.. ఇదే సమయంలో.. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్‌ బారినపడుతున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబైలో 230 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా సోకింది.

Read Also: టీనేజర్ల జోష్.. 3 రోజుల్లోనే 1.24 కోట్ల మందికి వ్యాక్సిన్

దీంతో నగరంలో వైరస్​ బారినపడిన రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య 260కి చేరిందని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.. వీరంతా నాలుగు రోజుల వ్యవధిలోనే వైరస్​బారినపపడడం కలకలం రేపుతోంది.. ముంబైలోని వివిధ ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులంతా వైరస్​కోరల్లో చిక్కుకుంటున్నారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్‌ విరుచుకుపడుతోన్న సమయంలో.. వైద్యులు మహమ్మారి బారినపడడం ఆందోలనకు గురిచేస్తోంది.

Related Articles

Latest Articles