చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం…

ఈ ఏడాది సరిగ్గా సగం ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే కోల్‌కత నైట్‌ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. ఇక తాజా సమాచారం ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఈ ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఐపీఎల్ లో చెన్నై తన తదుపరి మ్యాచ్ మే 5 న ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచుకు రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈరోజు కోల్‌కత-బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ ను బీసీసీఐ కరోనా కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles