జీజీహెచ్‌లో కలకలం.. 3 రోజుల శిశువు అపహరణ..

గుంటూరు.. జీజీహెచ్‌లో మూడు రోజుల‌ శిశువు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది… ఈ నెల 12న కాన్పుకోసం పెదకాకానికి చెందిన ప్రియాంక అనే గర్భిణి చేరారు.. 13వ తేదీన మగ శిశువుకు జన్మనించారు.. అయితే, శుక్రవారం రాత్రి పసివాడు ఏడుస్తుండడంతో బయటకు తీసుకెళ్లింది.. ఆ శిశువు నాయనమ్మ… ఇక, బాత్రూంకు వెళ్తూ అక్కడే నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును వదిలి వెళ్లింది నాయనమ్మ.. కానీ, ఐదు నిమిషాల్లోనే తిరిగి వచ్చే సరికి శిశువును అపహరణకు గురయ్యాడు.. దీంతో లబోదిబోమంటూ.. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఆస్పత్రిలో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.. ఇద్దరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.. వారి కోసం వేట ప్రారంభించారు.

Related Articles

Latest Articles