బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్

ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు.

Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్

ఈ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని అంచనా వేయడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. అయితే ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా నామినేట్ అయిన పోటీదారులలో వారి పర్ఫార్మెన్స్ కారణంగా ఎవరు ఎక్కువ డేంజర్ లో ఉన్నారో ఈజీగానే అంచనా వేయవచ్చు. ‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫాలోవర్ల ట్రెండ్‌లు, సోషల్ మీడియాను పరిశీలిస్తే ఈవారం నామినేషన్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం కన్పిస్తోంది. అన్నే మాస్టర్, సిరి, ప్రియాంక… ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

కాజల్ తన పర్ఫార్మెన్స్ కారణంగా ఇటీవలి ఎపిసోడ్స్‌లో అకస్మాత్తుగా ఆమె గ్రాఫ్ పెరిగింది. కాబట్టి ప్రేక్షకుల నుండి భారీ ఓట్లతో కాజల్ సేవ్ అవుతుంది. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, వారి ఓటింగ్ శాతం చూస్తే కనీసం రెండు వారాల పాటు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరోవైపు ఇటీవల ఎపిసోడ్స్ లో సిరి ప్రవర్తన కారణంగా ఆమెపై నెగెటివ్ ఒపీనియన్ వచ్చేసింది వీక్షకులకు. ఇక అనీ మాస్టర్ వెక్కిరింపులు ఆమెకు నెగెటివిటీని తెచ్చిపెట్టాయి. మిగిలింది ప్రియాంక సింగ్. ఆమె కేవలం ఇతర పోటీదారులతో స్నేహ బంధాన్ని పెంచుకోవడంలో మాత్రమే దృష్టి పెట్టింది. ఇకపై ఆమె షోలో కొనసాగడం కష్టం.

Related Articles

Latest Articles