ఏపీకి మ‌రో 3.60 ల‌క్ష‌ల క‌రోనా డోసులు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతున్న‌ది. క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఉద‌యం ఏపీకి మ‌రో 3.60 ల‌క్ష‌ల కోవీషీల్డ్ డోసులు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్డ్‌కు చేరుకున్న డోసుల‌ను గ‌న్న‌వ‌రం వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి అధికారులు జిల్లాల‌కు త‌ర‌లించ‌నున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-