సామాజికాంశం నేపథ్యంలో ‘ఓ మై గాడ్ -2’

2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన రెండు పోస్టర్స్ ను అక్షయ్ కుమార్ శనివారం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు… ఉజ్జయినిలో పంకజ్ త్రిపాఠీతో పాటు ఉన్న ఓ చిన్న పాటి వీడియోనూ విడుదల చేశారు. ‘మీ శుభాకాంక్షలు, అభినందనలు ‘ఓఎంజీ -2’కు కావాలి. ప్రధానమైన సామాజికాంశం నేపథ్యంలో ఈ సినిమాను నిజాయితీతో తీయబోతున్నాం. ఈ ప్రయాణంలో ఆదియోగి ఆశీస్సులు మాకు ఉంటాయని నమ్ముతున్నాం” అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో యామీ గౌతమ్ ఓ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ చిత్రానికి అమిత్ రాజ్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. విపుల్ డి షా, రాజేశ్ బెహల్, అశ్విన్ వార్దే ‘ఓఎంజీ -2’ను నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఓ మై గాడ్’ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు పరేశ్ రావెల్ కీలక పాత్ర పోషించారు. ఇదే సినిమా తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ అయ్యింది. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయన నటించిన కాప్ డ్రామా ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘అత్రంగీ రే’, ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘రక్షాబంధన్’, ‘రామ్ సేతు’, గుర్ఖా’ చిత్రాలలో అక్షయ్ నటిస్తున్నారు. కాగా ‘బెల్ బాటమ్’ మూవీ ఇటీవలే విడుదలైంది.

Related Articles

Latest Articles