ఇండియాలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు…

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 28,591 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూవాయి.. మరో 338 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 34,848 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,36,921కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,24,09,345కి పెరిగాయి.. ఇక, కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు 4,42,655 మంది మృతిచెందగా.. ప్రస్తుతం దేశంలో 3,84,921 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 72,86,883 డోసుల వ్యాక్సిన్‌ వేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 73,82,07,378 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Related Articles

Latest Articles

-Advertisement-