దేశంలో కొత్తగా 2,68,833 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు..

కరోనా వైరస్‌ తగ్గెదేలే అనే విధంగా రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలను భయపడుతోన్న కరోనా రక్కసి.. ఒమిక్రాన్‌ వ్యాప్తి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న వేళ పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠిన తరం చేశారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ విధించాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా 2,68,833 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

దీనితో పాటు గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,17,820 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 6,041కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. పాజిటివిటీ రేటు 16.66కు పెరిగింది.

Related Articles

Latest Articles