గందరగోళంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం..!

తెలంగాణలో 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం అయోమయంగా మారింది. ఈ కాలేజీల్లో జాయినైన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. కాలేజీల షిఫ్టింగ్‌ కు నోటిఫికేషన్ వేసి ఇంటర్‌బోర్డు.. దరఖాస్తులు తీసుకుంది. అయితే 3 నెలలుగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన విద్యాశాఖ.. చివరకు అనుమతివ్వలేదు. షిఫ్టింగ్‌కు అనుమతి వస్తుంది అన్న ధీమాతో.. కొత్త ప్లేసులో కాలేజీలు అడ్మిషన్ తీసుకున్నాయి. అయితే, ఆ బిల్డింగ్‌ల ఫైర్ ఎన్‌వోసీల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్‌వోసీ వస్తే తప్ప అనుబంధ గుర్తింపు ఇవ్వలేమన్నారు అధికారులు. దీంతో మరోసారి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది.

-Advertisement-గందరగోళంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం..!

Related Articles

Latest Articles