కరోనా రక్కసి విజృంభిస్తోంది.. కొత్తగా 2,47,417 కేసులు..

కరోనా మహమ్మారి తగ్గేదేలే అన్న విధంగా రోజురోజకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్ వెలుగులోకి రావడంతో రోజూ కరోనా కేసులు భారీగా నమోదవతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా నేడు ప్రధాని మోడీ రాష్ట్రాల సీఎంలతో కోవిడ్‌ విజృంభనపై సమీక్షించానున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 2,47,417 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడచిన 24 గంటల్లో మరో 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో ప్రస్తుతం 13.11 శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా 11,17,531 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ, రైల్వే బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్‌ అంక్షలు విధిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. బస్సులు, రైల్వే స్టేషన్‌లో కూడా కోవిడ్‌ నిబంధనలు కఠినతరం చేశారు.

Related Articles

Latest Articles