23వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు జరుగనుంది. అయితే నేడు 23వ రోజు నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ నాయకులు తెలిపారు. కొండబిట్రగుంట నుంచి ప్రారంభమయ్యే సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు సాగనుంది.

అయితే నవంబర్‌ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర డిసెంబర్‌ 15వ తిరుమలకు చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో అడ్వకేట్‌ జనరల్‌ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానికి తెలిపారు. అంతేకాకుండా నిన్న మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. కానీ.. మూడు రాజధానులపై మరోసారి చట్టాన్ని ప్రవేశపెడుతామని సీఎం జగన్‌ వెల్లడించారు.

Related Articles

Latest Articles