22వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర

ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు ప్రారంభించిన ఈ పాదయాత్రం 45 రోజుల పాటు సాగనుంది. అయితే డిసెంబర్‌ 15నున తిరుమలకు ఈ పాదయాత్ర చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి వరదలు బీభత్స సృష్టించాయి.

కొన్ని గ్రామాల వరద నీటితో జలదిగ్బంధంలో చిక్కుకోవడం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర మార్గంలో సైతం భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో రెండు రోజులు విరామం ఇచ్చారు. రెండు రోజుల విరామం తరువాత ప్రారంభమైన రాజధాని రైతుల పాదయాత్రం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే నెల్లూరులో కొనసాగుతున్న ఈ పాదయాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. ఈ రోజు బిట్రగుంట వరకు 13 కిలోమీటర్ల పాదయాత్ర సాగనున్నట్లు రాజధాని రైతుల జేఏసీ ప్రకటించింది.

Related Articles

Latest Articles