ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు…

ఢిల్లీలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 22,751 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  17 మంది క‌రోనాతో మృతి చెందారు.  కేసుల‌తో పాటు క్ర‌మంగా మ‌ర‌ణాల సంఖ్య‌కూడా పెరుగుతున్న‌ది.  నిర్ణ‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.  కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా నైట్ క‌ర్ఫ్యూను, వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  విద్యాసంస్థ‌ల‌ను మూసివేశారు.  సినిమా హాళ్లు ఇప్ప‌టికే బంధ్ అయ్యాయి.  ప్రార్థ‌నా మందిరాల్లో భ‌క్తుల‌ను నిరాక‌రిస్తున్నారు.

Read: క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ‌… బెంగ‌ళూరులో రికార్డ్ స్థాయిలో…

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్‌ను ఇచ్చేశారు.  అయిన‌ప్ప‌టికీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఢిల్లీలో 14,63,837 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 60,733 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  వారం ప‌దిరోజుల క్రితం వెయ్యిలోపే ఉన్న యాక్టీవ్ కేసులు, ఇప్పుడు ఒక్క‌సారిగా 60 వేల‌కు పెరిగాయి.  రాష్ట్రంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 23.53శాతంగా ఉన్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 10,179 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.  

Related Articles

Latest Articles