హైదరాబాదీ అలెర్ట్.. 3 రోజుల్లో విదేశాల నుంచి 2 వేలకు పైగా ప్రయాణికులు

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్‌ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్‌ తాజా రూపాంతరం అయిన ఒమిక్రాన్‌.. యావత్‌ ప్రపంచం వణికిపోయేలా చేస్తోంది.. ఈ వేరియంట్‌ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 14 దేశాలకు వ్యాప్తి చెందింది అంటే.. దాని స్పీడు, తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. కొత్త వేరియంట్‌ కేసులు వెలుగు చూస్తుండడంతో ఇప్పటికే రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఆయా రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి.. అయితే, ఇప్పుడు రిస్క్‌లో ఉన్న దేశాల నుంచి హైదరాబాద్‌కు ఏకంగా 2 వేల మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు. అది కూడా ఈ మూడు రోజుల వ్యవధిలోనే కావడం మరింత కలవరపెట్టే విషయం.

Read Also: ఆన్‌లైన్‌ ఆహార ప్రియులకు అలెర్ట్‌.. స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ సమ్మె..!

ఇక, కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగు చూసిన దేశాల నుంచి, ఆ రిస్క్‌ ఉన్న దేశాల నుంచి గత 3 రోజుల్లో హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చారు.. ఏ దేశం నుంచి ఎంత మంది హైదరాబాద్‌కు వచ్చారో గమనిస్తే.. యూకే నుంచి 1,717 మంది, సౌతాఫ్రికా నుంచి 185, బ్రెజిల్‌ నుంచి 10, బంగ్లాదేశ్‌ 9, బోట్స్‌వానా నుంచి 16, చైనా నుంచి 9, మారిషస్‌ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్‌ నుంచి 108 మంది, జింబాబ్వే నుంచి 11 మంది, యూరోపియన్‌ దేశాల నుంచి 102 మంది.. ఇలా మొత్తం మూడు రోజుల్లోనే 2,168 మంది విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అసలే, సాధారణ పరిస్థితులు వచ్చాయంటూ.. ఎవరూ కోవిడ్‌ రూల్స్‌ పాటించడంలేదు.. బహిరంగ ప్రదేశాల్లోనూ.. గుంపులుగా చేరిన దగ్గర కూడా మాస్క్‌లు కనిపించడంలేదు.. ఆ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరు ఎక్కడ ఉన్నారో.. ఎక్కడెక్కడ తిరిగేస్తున్నారు.. ఎవరిలో ఏ వేరియంట్‌ ఉందో తెలియని పరిస్థితి.. సో హైదరాబాదీ బీ అలెర్ట్.. నీ రక్షణ.. కుటుంబ సంరక్షణ నీ చేతుల్లోనే ఉంది.

Related Articles

Latest Articles