బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు

యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. మొన్నటివరకు కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతమైన ప్రజలు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నారు. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 6 రెట్లు వేగంగా వ్యాప్తించెందుతుండడంతో ఇప్పటికే ఈ వేరియంట్‌ పలు దేశాలకు వ్యాప్తి చెందింది.

భారత్‌లోనూ ఇటీవల ఎంటరైన ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాజస్తాన్‌లో 9 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. నేటి సాయంత్రం వరకు కొత్తగా మహారాష్ట్రలో వచ్చిన 7 ఒమిక్రాన్‌ కేసులతో 12 గా ఉన్న సంఖ్య తాజాగా రాజస్తాన్‌లో 9 మందికి రావడంతో 21కి చేరింది. ప్రస్తుతం రాజస్తాన్‌లో 9, మహరాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Related Articles

Latest Articles