అలర్ట్‌: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!

డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. ఇక, వాటిలో.. ఆయా రాష్ట్రాలను బట్టి అవి మారిపోయే అవకాశం కూడా ఉన్నాయి..

ఈ నెలలో బ్యాంకుల సెలవులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అక్టోబరు 1వ తేదీ అర్ధ సంవత్సర క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్.. ఇది కేవలం గ్యాంగ్‌టక్‌కే పరిమితం కాగా.. అక్టోబరు 2 గాంధీ జయంతి, 3న ఆదివారం, 6న మహాలయ అమావాస్య, 7న మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్‌తో సనామహి, 9న రెండో శనివారం, 10న ఆదివారం, 12న దుర్గా పూజ, 13న మహాష్టమి, 14న దుర్గా పూజ , 15న దసరా, 16న దుర్గా పూజ, 17న ఆదివారం, 18న కటి బిహు, 19న ఈద్ ఇ మిలాద్, 20న మహర్షి వాల్మికి పుట్టిన రోజు, 22న ఈద్ ఇ మిలాద్, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం, 26న అసెషన్ డే, 31న ఆదివారం ఇలా.. మొత్తంగా ఈ నెలలో 21 రోజులు సెలవులు వచ్చాయి. అయితే, ఈ 21 సెలవులు అన్ని రాష్ట్రాలకు ఏం వర్తించవు.. ఆయా సందర్భాలను బట్టి కొన్ని రాష్ట్రాలకే పరిమితం కానున్నాయి.

-Advertisement-అలర్ట్‌: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!

Related Articles

Latest Articles