మహారాష్ట్రలో కొత్తగా 20,971 కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అయితే దీంతో ఈ వేరియంట్‌ పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 20,971 కొత్త కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.

అయితే మహారాష్ట్రలో 20 వేల కేసులు దాటితే లాక్‌డౌన్‌ విధిస్తామని మహా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే కొత్తగా నమోదైన కేసులు సంఖ్య ప్రకారం మహాలో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేరళలో కొత్తగా 5,296 కరోనా కేసులు రాగా, 35 మంది మరణించారు. దీంతో పాటు కొత్తగా 25 ఒమిక్రాన్‌ కేసులు కూడా కేరళలో నమోదవడంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 305కు చేరింది. అలాగే కర్ణాటకలో 8,449, గోవాలో 1,432 చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Related Articles

Latest Articles