గతేడాది ‘వర్చువల్’… ఈసారి ‘లైవ్ ఈవెంట్’… సెప్టెంబర్ 19న ‘ఎమ్మీస్’!

హాలీవుడ్ సినిమాలకు ప్రకటించే ఆస్కార్స్ తరువాత ఆ రేంజ్లో క్రేజ్ సంతరించుకునే పురస్కారాలు… ‘ఎమ్మీ అవార్డ్స్’. అమెరికన్ టెలివిజన్ కార్యక్రమాలకి, నటులకి ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ సారి సెప్టెంబర్ 19న విజేతల చేతుల్లో మెరిసిపోనున్నాయి. అయితే, గత సంవత్సరం కరోనా కల్లోలంతో ఎమ్మీ అవార్డ్స్ వర్చువల్ గా జరిగిపోయాయి. ఈసారి అలా కాకుండా పూర్వ వైభవం సంతరించుకుని ప్రత్యక్షంగా సాగనున్నాయి. అయితే, ‘ఎమ్మీస్’ లైవ్ కి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరుకానున్నారు…

కరోనా భయం అమెరికాలో కాస్త తగ్గుముఖం పట్టటంతో చాలా లైవ్ ఈవెంట్స్ మళ్లీ మొదలయ్యాయి. ఎమ్మీ అవార్డ్స్ కూడా తగిన జాగ్రత్తల నడుమ లైవ్ గా నిర్వహించబోతున్నారు. ఈసారి ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్ గా’ సెడ్రిక్ ద ఎంటర్టైనర్’ వ్యవహరించనున్నాడు. “చిన్నతనంలో మా గ్రాండ్ మదర్ పక్కన కూర్చుని ఆశ్చర్యంగా బుల్లి తెరని చూసినప్పటి నుంచీ టెలివిజన్ నాకు గొప్ప ఫ్రెండ్ లాంటిది! అందుకే, టెలీ అవార్డ్స్ హోస్ట్ చేయటం ఆనందంగా ఉంది…’’ అన్నాడు సెడ్రిక్. ‘ద క్రౌన్, టెడ్ లాసో, ద మ్యాండలోరియన్, బ్రిడ్జర్ టౌన్’ లాంటి టీవీ షోస్ ఈ సారి ఎమ్మీస్ లో దుమారం రేపే అవకాశాలున్నాయి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-