ఢిల్లీలో క‌రోనా టెర్ర‌ర్‌: 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు…

ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఒమిక్రాన్ కార‌ణంగా కేసులు పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 20,181 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  క‌రోనాతో ఏడుగురు మృతి చెందారు.  ప్ర‌స్తుతం ఢిల్లీలో 48,178 కేసులు యాక్టీవ్‌గా ఉండ‌గా, 24 గంట‌ల్లో 11,869 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 25,143 మంది క‌రోనాతో మృతిచెందారు.  ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.6 శాతంగా ఉన్న‌ట్టు ఢిల్లీ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Read: చంద్ర‌బాబుకు వైసీపీ మంత్రి స‌వాల్‌…

ఈ స్థాయిలో కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.  నైట్ క‌ర్ఫ్యూతో పాటుగా ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  శ‌ని, ఆదివారాల్లో కంప్లీట్ గా క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  అయితే, ఆదివారం రోజున సిక్కుల పండుగ ఉండ‌టంతో గురుద్వారాల‌ను ఓపెన్ చేసి ఉంచుతామ‌ని, సిక్కులను ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు అనుమ‌తిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  

Related Articles

Latest Articles