‘కేజీఎఫ్​ 2’ టీజర్.. సరికొత్త రికార్డు

దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా ఓ ఊపు ఊపిన సినిమా ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. య‌శ్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జులై 16న (నేడు) రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, కేజీఎఫ్ 2 టీజర్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోంది. జ‌న‌వ‌రి 7న విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ యూట్యూబ్​లో 200 మిలియన్ల వ్యూస్ సాధించి దుమ్మురేపుతోంది. ఈ టీజర్​ కు ఇప్పటివరకు 8.4 మిలియన్ లైక్స్ రావడం మరో విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-