త‌ల్లి ప‌క్క నుంచి మాయం.. నీటి ట్యాంకులో బాలుడి మృత‌దేహం..

హైద‌రాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో దారుణ‌మైన ఘ‌న జ‌రిగింది.. తల్లితో కలిసి నిద్రించిన రెండు నెల‌ల బాలుడిని మాయం చేసిన దుండ‌గులు.. తెల్లవారే సరికి బాలుడిని హ‌త్య చేసి.. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో మృత‌దేహాన్ని వేసి ప‌రార‌య్యారు.. తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో కంగారుపడి త‌ల్లిదండ్రులు.. బాలుడి ఆచూకీ కోసం ఇల్లు, ప‌రిస‌ర‌ప్రాంతాలు వెతికారు.. చుట్టుప‌క్క‌ల‌వారిని ఆరా తీశారు.. ఎంత‌కీ బాలుడి ఆచూకీ దొర‌క‌క‌పోవ‌డంతో.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించారు.. అయినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇంట్లో గాలించారు.. చివరకు ఇంటిపైకప్పుపై ఉన్న నీటి ట్యాంకును పరిశీలించగా బాలుడి మృతదేహం క‌నిపించింది.. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-