‘దిల్ చాహ్ తా హై 2, డాన్ 3’ సీక్వెల్స్ లేవంటున్న ఫర్హాన్

ఫర్హాన్ అఖ్తర్ నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా. అయితే, గత కొంత కాలంగా ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల డైరెక్టర్ కెమెరా ముందే ఎక్కువగా కనిపిస్తున్నాడు. కెమెరా వెనక్కి వెళ్లి దర్శకత్వం వహించి చాలా రోజులే అయింది. కానీ, తాజాగా ఫర్హాన్ దర్శకుడిగా తన మనసులోని మాట బయటపెట్టాడు. చాలా మంది తనని ‘దిల్ చాహ్ తా హై 2, డాన్ 3’ సీక్వెల్స్ గురించి అడుగుతుంటారనీ తెలిపిన అఖ్తర్ జూనియర్… ఆ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు ఆలోచించటం లేదని అన్నాడు. అయితే, దర్శకుడిగా జనం ముందుకు రావాలని మాత్రం ఉందట!

ఫర్హాన్ అఖ్తర్ ఏ విషయమూ స్పష్టంగా చెప్పనప్పటికీ డైరెక్టర్ గా త్వరలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేస్తానన్నాడు. అదే సమయంలో గత చిత్రాలకు సీక్వెల్స్ చేసే ఉద్దేశం సమీప భవిష్యత్తులో లేదని కూడా హింట్ ఇచ్చేశాడు. సో, జూలై 16న ‘తూఫాన్’ సినిమాతో మరోసారి నటుడిగా మన ముందుకు వస్తోన్న టాలెంటెడ్ స్టార్… డైరెక్టర్ గా మాత్రం ఏదో సరికొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడని భావించవచ్చు! ‘భాగ్ మిల్కా భాగ్’ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో ‘తూఫాన్’ మూవీ రూపొందింది. అమేజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ అవ్వనుంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-