బాలకృష్ణ సరసన ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు!

గతంలో ఇతరుల కథలను తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేసిన మలినేని గోపీచంద్ ‘క్రాక్’ నుండి రూటు మార్చాడు. తానే తన చిత్రాలకు కథలను రాసుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ ఐడియాను తయారు చేసుకుని, రచయితల సహకారంతో దానిని డెవలప్ చేయిస్తున్నాడు. దాంతో కథ మీద గోపీచంద్ కు గ్రిప్ ఏర్పడటమే కాక, తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తీయగలుగుతున్నానా లేదా అనే జడ్జిమెంట్ కూడా షూటింగ్ సమయంలోనే వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే పని త్వరలో నందమూరి బాలకృష్ణతో తాను చేయబోతున్న సినిమాకూ వర్తింప చేస్తున్నాడు మలినేని గోపీచంద్. ఈ సినిమాకూ కథను తానే తయారు చేసుకున్నాడు. సమాజంలోని కొన్ని సంఘటనల ఆధారంగా బాలకృష్ణ కోసం గోపీచంద్ కథను తయారు చేశాడని తెలుస్తోంది. అందుకే ఆ మధ్య వేటపాలెం లైబ్రరీకీ వెళ్ళి, మెటీరియల్ ను సేకరించుకున్నాడు. ఇక తాజా సమాచారం ఏమంటే… బాలకృష్ణ – గోపీచంద్ మలినేని చిత్రంలో ఇద్దరు నాయికలు ఉండబోతున్నారట. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ నటించబోయే చిత్రం ఇదే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ నటిస్తుండటంతో నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారట! ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి ఊపు మీద ఉన్న మలినేని గోపీచంద్… దీన్ని కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-