సెన్సార్ లో ‘1948 – అఖండ భారత్’

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘1948-అఖండ భారత్’. భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. గాంధీ
జయంతి సందర్బంగా ఈ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆలేఖ్య శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ నటించారు. నిర్మాణం పూర్తి చేసుకుని సెన్సార్ కి సిద్ధమైందని నిర్మాత చెబుతున్నారు.
గాంధీజీని చంపింది ఎవరో అందరికి తెలుసు. అయితే ఎందుకు? ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియవు. గాడ్సే కోర్ట్ వాదనలో గాంధీజీని వధించడానికి కారణాలు వివరించినా… అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వాటికి రాకుండా చేసింది. గాడ్సేని ఉరి తీసిన 30 సంవత్సరాల తర్వాత వాగ్మూలం బయటకు వచ్చినా ప్రచురణ కాకుండా అడ్డుకుంది కాంగ్రేస్. అలా 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను… ప్రామాణికంగా పరిశోధన చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసి సినిమాగా తీశామంటున్నారు మహర్షి. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు… హత్య తదనంతర పరిణామాల నేపధ్యంతో ఈ చిత్రం తెరకెక్కించామని, వివాదాలకు తావులేకుండా మరుగున పడిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా తెరకెక్కించామంటున్నారు. 11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి… 96 పాత్రలు, 114 సీన్స్, 2200కి పైగా సెట్ ప్రొపర్టీస్, 1670కి పైగా కాస్ట్యూమ్స్, 1500కి పైగా జూనియర్ ఆర్టిస్టులతో 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ అంటురు.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం: శశిప్రీతమ్, ఎడిటింగ్: రాజు జాదవ్, కెమెరా: చంద్రశేఖర్, నిర్మాత: ఎమ్.వై. మహర్షి, దర్శకత్వం: ఈశ్వర్ డి.బాబు.

సెన్సార్ లో '1948 - అఖండ భారత్'
-Advertisement-సెన్సార్ లో '1948 - అఖండ భారత్'

Related Articles

Latest Articles