తెలంగాణలో కొత్తగా 1,913 కేసులు..

రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా రక్కరి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతుండడంతో తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో 1,913 కొత్త కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు.

అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 232 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,847 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీలో 1,214, రంగారెడ్డిలో 213, మేడ్చల్‌లో 161 కేసులు న‌మోదయ్యాయి. దీనితో పాటు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 94కు చేరుకుంది. అయితే దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Related Articles

Latest Articles