మహారాష్ట్రలో ఎదురు కాల్పులు… 13మంది మవోయిస్టులు హతం..!

మహారాష్ట్ర ఏజెన్సీలో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కొట్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీ-60 బెటాలియన్‌కు చెందిన భద్రతా బలగాలు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడి కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో సుమారు 13మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాధమిక సమాచారం అందింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-మహారాష్ట్రలో ఎదురు కాల్పులు... 13మంది మవోయిస్టులు హతం..!

Related Articles

Latest Articles