కరీంనగర్‌లో వింత! తల పైకి ఎత్తి అరుస్తున్న పాము!!

కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-