మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు భారీగా హాజ‌రైన జనం…ప్ర‌భుత్వం ఆగ్ర‌హం…

మ‌ధ్య‌ప్రదేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు, నిబంధ‌నల‌ను అమ‌లు చేస్తున్నది. వేడుక‌ల‌కు జ‌నాల ప‌రిమితికి మించి జ‌నాల‌ను అనుమ‌తించ‌డంలేదు.  ఇక అంత్య‌క్రియ‌ల‌కు కూడా ప‌రిమితికి మించి అనుమ‌తించ‌డం లేదు.  అయితే, రాజ్‌గ‌డ్‌జిల్లాలోని దాలుపురా గ్రామంలో ఓ వాన‌రం మృతి చెంద‌డంతో దానికి గ్రామ‌స్తులు సంప్ర‌దాయ బ‌ద్దంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు గ్రామ‌స్తులంతా క‌ద‌లివ‌చ్చారు.  ఈ అంత్య‌క్రియ‌ల్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు.  అంత్య‌క్రియ‌ల అనంత‌రం గ్రామ‌స్తులంతా చందాలు వేసుకొని భోజ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు.  అంద‌రూ క‌లిసి భోజ‌నాలు చేశారు.  

Read: ఈ మూడింటిని పాటిస్తే… క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు…

ఒకేచోట అంత‌మంది గుమిగూడ‌టంతో క‌రోనా వ్యాపిస్తుంద‌నే భ‌యం ఎవ‌రిలోనూ క‌నిపించ‌లేదు. ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న స‌మ‌యంలో ఈ స్థాయిలో ప్ర‌జ‌లు ఒకేచోట గుమిగూడ‌టంతో ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  విచార‌ణ‌కు ఆదేశించింది.  వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  ఈ అంత్య‌క్రియ‌ల్లో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించిన ఇద్ద‌రిని పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు.  

Related Articles

Latest Articles