నోయల్ ’14’ మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణు

నోయల్, విశాఖ ధీమాన్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ’14’. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయన, ఎన్. శివకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు టీజర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”నోయల్ కు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ దక్కాలి. అతనితో నాది 15 సంవత్సరాల అనుబంధం. అప్పట్లో అందరం కలిసి, సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం. ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబుల్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే, అంతా కలిసి బైక్స్ మీదో కారులోనో వచ్చే వాళ్ళం. నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వాళ్ళు.  వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది” అని అన్నారు.

Read Also : బాలకృష్ణతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ

నిర్మాత సుబ్బారావు రాయన మాట్లాడుతూ, ”దుర్గాష్టమి రోజు మా టీజర్ విడుదల చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు మాకు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ మూవీ నిర్మించడానికి ముందుకు వచ్చాం. ఈ సినిమా తర్వాత చాలా  సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ విష్ణు గారు మాకు అవకాశం ఇస్తే తనతో కూడా మేం మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. హీరో నోయల్ మాట్లాడుతూ, ”ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద వున్నాను అంటే దానికి కారణం రాజమౌళి, సుకుమార్ గార్లు. వాళ్లకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పిన సరిపోదు. శ్రీ విష్ణు ఉండే స్థాయికి ఈ కార్యక్రమానికి అతను రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఫోన్ చేయగానే వచ్చాడు. ఆ రోజుల్లో మాట్లాడిన విష్ణుకి ఇప్పుడు మాట్లాడే విష్ణుకి తేడా ఏమీ లేదు. నాకు కొంచెం పొగరు వచ్చిందేమో కాని శ్రీవిష్ణు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అలానే మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డిఓపి సాయి గారు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించారు” అని అన్నారు.

ప్రవీణ్‌ సత్తారు, కరుణాకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన లక్ష్మీ శ్రీనివాస్ కు ఈ సినిమా చక్కని విజయాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని ఆర్టిస్ట్ లోహిత్ వ్యక్తం చేశాడు.

-Advertisement-నోయల్ '14' మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణు

Related Articles

Latest Articles