తమిళనాడులో దారుణం.. శానిటైజర్‌తో పసివాడు మృతి

కరోనా మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, కుదిరితే ఎక్కువ సార్లు చేతలను శుభ్రం చేసుకోవడం.. లేని పక్షంలో శానిటైజర్‌ వాడాలని వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు.. దీంతో.. క్రమంగా శానిటైజర్‌ వాడేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది.. అయితే, శానిటైజర్‌ వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా లేకపోలేదు.. తాజాగా.. తమిళనాడులో శానిటైజర్‌ కారణంగా మంటలు అంటుకొని పసివాడు బలయ్యారు.. తిరుచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 13 ఏళ్ల శ్రీసం అనే బాలుడు.. ఇంట్లో వారు చేస్తున్న వంటలు మాదిరిగా వంట చేయాలని ప్రయత్నించాడు.. రాళ్లపై కుండ పెట్టి.. నీళ్లు అనుకొని.. శానిటైజర్‌ను ఆ కుండలో పోశాడు.. ఆ తర్వాత కుండ కింద నిప్పు పెట్టాడు.. ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. ఆ మంటల్లో చిక్కుకున్నాడు.. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించినా ఉపయోగిం లేకుండా పోయింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతిచెందాడు.. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. మరోవైపు.. పిల్లలకు శానిటైజర్ దూరంగా ఉంచాలంటున్న సూచిస్తున్నారు వైద్యు నిపుణులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-