ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం… 13 మంది విద్యార్థులకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. రోజుకు 200కి పైగానే కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరా గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 650 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించామని… వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: సెలవు ఇవ్వలేదని ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..?

కాగా ప్రస్తుతం కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. కరోనా బారిన పడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. అయితే సదరు విద్యార్థులతో సన్నిహితంగా ఉన్నవారికి కూడా మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా కరోనా కేసుల కారణంగా విద్యార్థులను స్కూళ్లకు పంపాలంటే వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Related Articles

Latest Articles